ఘనంగా బీఎంఎస్ వ్యవస్థాపక దినోత్సవం
విశ్వంభర, చిక్కడపల్లి: 35 మంది సభ్యులతో ప్రారంభమైన భారతీయ మజ్దూర్ సంఘ్ నేడు 3 కోట్ల సభ్యులతో దేశంలో అతిపెద్ద కార్మిక సంఘంగా ఎదిగిందని భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారత కార్యదర్శి అనిల్ ధుమ్లే అన్నారు. హైదరాబాదు ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న దత్తోపంత్ థెంగడి భవన్‌లో గురువారం భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) తెలంగాణ శాఖ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ ధుమ్లే బీఎంఎస్ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం బీఎంఎస్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో: రాష్ట్ర సంఘటనా కార్యదర్శి రామోహన్ ప్రజారంగ ప్రధాన కార్యదర్శి రావుల వెంకటరావు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు జయేందర్ జీ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యదర్శి కృష్ణ పాల్గొన్నారు.