సెప్టెంబర్ 1న 'ఛలో ఢిల్లీ' పోస్టర్ ఆవిష్కరణ

విశ్వంభర, హిమాయత్ నగర్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు, సెప్టెంబర్ 1న 'ఛలో ఢిల్లీ' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీపీఐ నాయకులు తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాదు హిమాయత్ నగర్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో 'చలో ఢిల్లీ' పోస్టర్‌ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టి, అనంతరం సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగం హేమంతరావు, కలవేన శంకర్, పశ్య పద్మ, కె. రామకృష్ణ, కూనంనేని సాంబశివరావు, బాలకిషన్, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, వి.ఎస్. బోస్, ఈటి నరసింహ పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chalo-delhi-poster-launch-on-1st-september/article-19643

Tags: