ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గుచూపాలు

ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గుచూపాలు

  • జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర

విశ్వంభర, నెల్లికుదురు: ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్లో రైతులు సాగు తో పాటు పండించాల్సిన  పంటల పట్ల అనుసరించే విధానంపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నెల్లికుదురు మండలంలోని సౌల్ల తండాలో గురువారం కర్షకులకు అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సర్పంచి గుగులోతు సుజాత వాసు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర హాజరై రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని రైతులను కోరారు.నీరు అధికంగా అవసరం లేనటువంటి కంది,పెసర,మినుము, బొబ్బర్లు,సజ్జ,జొన్న,కూరగాయలు,ఆయిల్ ఫామ్ పంటలు పండించేందుకు రైతులు ముగ్గు చూపాలన్నారు. ఎక్కువ నీటి ఆధారంగా పండే వరి పంటల పట్ల ఆసక్తి కనపరచకుండా ఎంతో కొంత తిండి కోసం మాత్రమే సాగు చేసుకోవాలన్నారు. ఎప్పుడూ పండించే వరి,పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలనే సాగు చేయకుండా పంట మార్పిడి చేసుకోవడం వలన వర్షాభావ పరిస్థితులను అధిగమించడమే కాకుండా అనేక ప్రయోజనాలు పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్, ఇరిగేషన్ ఏఈ ప్రణయ్,ఏఈవో ధరణీష్ రైతులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/farmers-tend-towards-dry-season-crops/article-19589

Tags: