రాహుల్ గాంధీ కి మద్దతుగా  కాంగ్రెస్ పార్టీ నిరసన

విశ్వంభర, డిండి:  మండల కేంద్రంలో టీపీసీసీ పిలుపు మేరకు, కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు  రాహుల్ గాంధీ కి సంఘీభావంగా డిండి రాజీవ్ గాంధీ చౌరాస్తా లో నిర్వహించిన  నిరసన కార్యక్రమంలో  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొంతినేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు  శశిధర్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ, ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పై జరిగిన దాడి దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక దురదృష్టకర సంఘటన అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని, ఆ హక్కును కాలరాయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ  పై జరిగిన దాడి ఒక్క వ్యక్తిపై జరిగిన దాడి కాదు రాజ్యాంగంపై ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేశారని, శ్రీమతి ఇందిరా గాంధీ  దేశ సమగ్రత కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని  రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టారని, శ్రీమతి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో బలోపేతం చేశారని ఈ నిరసన కార్యక్రమంలో   యువజన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు. కాంగ్రెస్ పార్టీ సర్పంచులు. మాజీ సర్పంచులు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఎన్‌ఎస్‌యూఐ నాయకులు. కార్యకర్తలు. పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/congress-party-protest-in-support-of-rahul-gandhi/article-19577

Tags: