వైద్య శిబిరాలను సద్వినియోగంచేసుకోవాలి

వైద్య శిబిరాలను సద్వినియోగంచేసుకోవాలి

 విశ్వంభర, త్రిపురారం : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకులు, జ్యోతి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మువ్వ రామా రావు కోరారు.  త్రిపురారం మండలం చెన్నైపాలెం గ్రామంలో గురువారం  జ్యోతి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు వైద్యం అందక అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆయాప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేసి ఉచితంగా  మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగావందలాదిమంది ప్రజలకు బిపి, షుగర్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాము, మాజీ ఎంపీటీసీ చేన్నలు, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్,వైద్య బృందం డాక్టర్లువినీత్,సాయి,విక్రమ్, వైద్యసిబ్బందినాగేంద్రబాబు,నాగరాజు,విష్ణు, సంధ్య, రేణుక,ప్రత్యూ పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/medical-camps-should-be-taken-advantage-of/article-19605

Tags: