ఇమాంపేట గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పరిధిలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, ఆహార సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలో భాగంగా కిచెన్, డైనింగ్ హాల్, కూరగాయలు, బియ్యం తదితర నిత్యావసర సరుకుల నిల్వ గదులను పరిశీలించి పరిశుభ్రత, నిర్వహణపై పలు సూచనలు చేశారు. కూరగాయలు, సరుకులను నాణ్యత దెబ్బతినకుండా భద్రపరచాలని, గుడ్లను అవసరానికి అనుగుణంగా మాత్రమే నిల్వ ఉంచాలని సూచించారు. వంటశాల, భోజనశాలలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం పదో తరగతి గదిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులకు కొద్దిసేపు హిందీ పాఠాన్ని బోధించి, ఉన్నత లక్ష్యాలతో చదువుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలని ప్రోత్సహించారు. కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్లేగ్రౌండ్ విస్తరణకు విద్యార్థులు చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్, ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. మెస్ కమిటీ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. టాయిలెట్లు, ఫ్యాన్లు, లైట్లు, డోర్లకు సంబంధించిన చిన్నపాటి మరమ్మతులను 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సీహెచ్ పద్మ, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయురాలు భవాని తదితరులు పాల్గొన్నారు.