గీత కార్మికుల సంక్షేమానికి 18 కోట్ల నిధులు విడుదల
:కృతజ్ఞతలు తెలిపిన సర్వాయి పాపన్న గౌడ సంఘం
విశ్వంభర, రామన్నపేట: రాష్ట్రంలోని గీత కార్మికుల సంక్షేమం కోసం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 18 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం పట్ల సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కప్పల రవి కుమార్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది గీత కార్మిక కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని, గౌడ అన్నలకు ప్రభుత్వం తోడుగా నిలవడం అభినందనీయమని రవి కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృత్తి రీత్యా చెట్లు ఎక్కేటప్పుడు ప్రమాదాల బారిన పడకుండా గీత కార్మికులందరికీ నాణ్యమైన సేఫ్టీ మోకులను అందించాలని, వృత్తి రీత్యా శారీరక శ్రమతో కూడుకున్న పని కాబట్టి, 50 సంవత్సరాలు నిండిన ప్రతీ గీత కార్మికునికి ఆసరా/సామాజిక పింఛను మంజూరు చేయాలని, కల్లు విక్రయాలు, రవాణా సులభతరం చేసేందుకు అర్హులైన గీత కార్మికులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు పంపిణీ చేయాలని కోరారు. అంతే కాకుండా గీత వృత్తిలో వికలాంగులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో 20 శాతం రాయితీ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని కోరారు. గీత కార్మికుల న్యాయమైన కోరికలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి, త్వరితగతిన సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పరిటాల రవి కుమార్ గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.