విద్యార్థులపై పోలీసు చర్యను ఖండిస్తూ నిరసన ర్యాలీ

విశ్వంభర, అంబర్‌పేట : ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను నిరసిస్తూ గురువారం బాగ్ అంబర్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు రావుల సుధాకర్ ఆధ్వర్యంలో హైదరాబాదు అంబర్‌పేట గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రావుల సుధాకర్ మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసు చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. విద్యార్థుల సమస్యలను అణచివేయకుండా చర్చల ద్వారా పరిష్కరించాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం శ్రీధర్ గౌడ్, కోటం అనిల్, సునీత రెడ్డి, సర్ఫరాజ్, మొయిజ్, మహేందర్, సైఫ్, సందీప్ గౌడ్, కిరణ్, నవాజ్, సలీం, అఫ్జల్, లావణ్య, భాస్కర్, శ్రీధర్, రాకేష్, శ్రీకాంత్, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/protest-rally-condemning-police-action-against-students/article-19633

Tags: