యాదాద్రి శిల్పకళాశాలను బలోపేతం చేయాలి
విశ్వంభర, హైదరాబాదు : యాదాద్రి శిల్పకళాశాలను పూర్తి స్థాయి మౌలిక వసతులు, అధ్యాపకులు, సిబ్బందితో అభివృద్ధి చేయాలని, దీంతో సంప్రదాయ శిల్పకళ పరిరక్షణతో పాటు శిల్పులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని తెలంగాణ స్థపతులు, శిల్పులు కోరారు. గురువారం దేవాదాయ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన వారు, దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న స్థపతి పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసి స్థపతి విభాగాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని చారిత్రక దేవాలయాల సంరక్షణకు నైపుణ్యం కలిగిన స్థపతులు, శిల్పుల సేవలను వినియోగించాలని కోరారు. అలాగే రామప్ప దేవాలయం తరహాలో ఇతర చారిత్రక దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వినతిపై దేవాదాయ శాఖ కమిషనర్ సానుకూలంగా స్పందించి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.