వైభవంగా ముత్యాలమ్మ రథోత్సవం
విశ్వంభర, అంబర్ పేట : ఉగాది పర్వదినం సందర్భంగా అంబర్ పేట ముత్యాలమ్మ అమ్మవారి రథం ఊరేగింపును దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబర్ పేటలోని ముత్యాలమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా రథోత్సవం భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. మహంకాళి దేవాలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర ముత్యాలమ్మ దేవాలయం వరకు కొనసాగి భక్తులను ఆకట్టుకుంది. వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఊరేగింపులో దేవాలయ కమిటీ అధ్యక్షుడు దేవరుప్పల నరసింహ, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు వెంకటేష్, రమేష్, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు అంజయ్య, వీరస్వామి, నాగేందర్, కృష్ణ, అనిల్, శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు. పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.



