పద్మ శ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య కన్నుమూత

పద్మ శ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య కన్నుమూత

 

పద్మ శ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా అనారోగ్య పరిస్థితి విషమించి ఆదివారం రోజున ఆయన మృతి చెందారు. భద్రద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలంలోని కూనవరం ఆయన స్వగ్రామం.

Read More చలాన్ పడితే అకౌంట్‌లో డబ్బులు కట్

కాగా గ్రామంలోని ఇంటి వద్దనే ఆయన కన్నుమూసినట్టు తెలిపారు బంధువులు. ఆయన గతంలో కంచుమేళం - కంచుతాళం వాయిస్తూ ఆదివాసీ తెగల కథలు చెప్పే కళాకారుల్లో అత్యంత చిట్టచివరి వ్యక్తిగా గుర్తింపు పొందారు. దాంతో పాటు సమ్మక్క, సారలమ్మలను చిలకల గుట్ట మీద నుంచి తెచ్చే సమయంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించేవారు. 

గతంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ శ్రీ అవార్డును ప్రకటించింది. 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు రామచంద్రయ్య. ఇక ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.