ఇంద్రేశంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
On
విశ్వంభర, సంగారెడ్డి : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకొని మంగళవారం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధి వీకర్ సెక్షన్ కాలనీలో గల అంబేద్కర్ విగ్రహానికి స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఐలాపురం నాగరాజు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో అసమానతలు రూపుమాపి అందరికీ సమ న్యాయం అందించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. నేటితరం యువత అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఐలాపురం నాగరాజు, రఘునాయక్,స్వామి,సతీష్ గౌడ్, ఎస్సీ సంఘం అధ్యక్షులు ఉషయ్య,ఉప ఉపాధ్యక్షులు డప్పు నరసింహులు,బాలరాజ్, యూత్ కాంగ్రెస్ లీడర్,పర్శరాములు, ఎరుపుల నాగరాజు, విట్టల్, దాసు,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.



