ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ జయంతి 

ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ జయంతి 

విశ్వంభర, హైదరాబాదు : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదు ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ హేమ జిల్లోజు మాట్లాడుతూ, అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులు అట్టడుగు వర్గాలకు చేరినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్ర వర్కింగ్ కన్వీనర్ బుర్ర రాము గౌడ్ మాట్లాడుతూ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ సోహెబ్, జావీద్ షరీఫ్, దర్శనం రమేష్, సలావుద్దీన్, సనోజ్ యాదవ్, రాకేష్ రెడ్డి, బాబూలాల్ పవర్, అజీమ్, శాబాజ్, మూర్తుజా, సత్యనారాయణ రెడ్డి, కొడంగల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags: