అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
On
విశ్వంభర, బషీర్ బాగ్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ ప్రెసిడెంట్, టీఎన్జీవోస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ టి.జి. సెంట్రల్ ఫోరం ప్రెసిడెంట్ కె.ఆర్.రాజ్‌కుమార్, ఫోరం జాయింట్ సెక్రటరీ సుదర్శన్ లు పుష్పాంజలి ఘటించి, కేక్ కట్ చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ సెక్రటరీ దిల్లూ శివ, శివరాజ్, కళ్యాణ్, బాలాజీ గోస్వామి, శ్రీనివాస్, పురుషోత్తం, అనిల్, శేఖర్ గౌడ్, బచన్‌సింగ్, కలీం, పాండు రంగ, సవత్ యాదవ్, శ్రీనివాస్, సంజీవ, శ్రీకాంత్, సాగర్ పాల్గొన్నారు.



