అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి 

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి 

  • ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్

విశ్వంభర, మహబూబాబాద్: అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని కోర్టు సెంటర్లో   ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్  భారత రత్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి, రోడ్డు భద్రతకు సహకరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని తెలియజేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో కుల సంఘాల ప్రతినిధులు జిల్లాలోని ప్రజలు అన్ని విభాగాల సిబ్బంది తో కలిసి అంబేద్కర్ జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ మాట్లాడుతూ, ప్రస్తుత యువత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఆశయాలకనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని అన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులను గౌరవిస్తూ మంచి ఉన్నతమైన చదువులు చదివి గొప్ప స్థాయికి చేరుకోవాలని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రజలకు అత్యంత ముఖ్యమైన పథకాలు అంశాలను చేరవేస్తూ అవగాహన కల్పిస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ,  ప్రపంచంలో అన్ని దేశాలకు ఆదర్శం భారత రాజ్యాంగం అని రాజ్యాంగం ద్వారా ఏర్పడిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి యూపీఎస్సీ రాజ్యాంగం ద్వారానే ఏర్పడిందని, అట్టి సంస్థ ద్వారా దేశంలోనే అత్యున్నత సర్వీసులలో ఉత్తీర్ణత పొంది ప్రజలకు సేవ చేయడం ద్వారా ఆయన ఆశయాలను కొనసాగించడం జరుగుతుందని అన్నారు. మహిళలు అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు కచ్చితంగా ఉండాలనే అంబేద్కర్ ఆలోచన రాజ్యాంగం ద్వారా అమలు జరిగిందని గుర్తుకు చేశారు. కొన్నిచోట్ల గ్రామీణ ప్రాంతాలలో కుల వివక్షత నిర్మూలనకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థలు లోకల్ బాడీలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్ కుమార్, మహబూబాబాద్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, కుల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు మహిళా ఉద్యోగులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags: