అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే 

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే 

విశ్వంభర, పరిగి:  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సమానత్వం, స్వేచ్ఛ, సోదర భావం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం దేశానికి దిశా నిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రజిత వెంకటేష్, ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి, మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ అయ్యుబ్, మున్సిపల్ వైస్ చైర్మన్ హనుమంతు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణ, కౌన్సిలర్ లు బాదం అఖిల శ్రీనివాస్ గుప్తా, ఏజాజ్, యూసుఫ్, ఆరిఫ్ పటేల్,  డిసిసి ఉపాధ్యక్షులు లాలూ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు అశోక్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Tags: