ఎర్రమాద కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు
విశ్వంభర, సూర్యాపేట: సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ లయన్ ఎర్రమాద కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు బుదవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సమాచార హక్కు వికాసమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉన్నం సత్యనారాయణ నివాసంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎర్రమాద కృష్ణారెడ్డి జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అన్నారు. వారి సేవ కార్యక్రమాలు మరింత ఉదృతం చేయాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిని చేరుకోవాలని అన్నారు. వారి సేవలు గ్రామాలలో మండలాలలో, జిల్లా స్థాయిలో ఉత్తమమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తంగెళ్ల లక్ష్మీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దండ వెంకటరెడ్డి , సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు బంగారు శ్రీధర్, సూర్యాపేట టౌన్ కార్య వర్గ సభ్యులు గుడుగుంట్ల విద్యాసాగర్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.



