మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కార్యాలయం ప్రారంభం 

మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కార్యాలయం ప్రారంభం 

 విశ్వంభర, మిర్యాలగూడ:  మిర్యాలగూడ  స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ వైస్ చైర్ పర్సన్  కార్యాలయాన్ని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి  రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ​అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారికి మెరుగైన సేవలందించేందుకు ఈ కార్యాలయం వేదికగా నిలవాలని కోరారు. వార్డుల అభివృద్ధికి, ప్రజల అవసరాలకు వైస్ చైర్ పర్సన్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కౌన్సిల్ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.  ​మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకి, కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, పట్టణ సమగ్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సతీమణి బత్తుల మాధవి, మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధ బాలకృష్ణ,  పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డీఎస్పీ రాజశేఖర్ రాజు , పట్టణ కౌన్సిలర్లు, నాయకులు, రైస్ మిల్లర్స్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: