అంబర్‌పేటలో అంబేద్కర్ జయంతి వేడుకలు
On
విశ్వంభర, అంబర్‌పేట : డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా అంబర్‌పేటలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె రూబీ స్టీవెన్ సన్, ప్రధాన కార్యదర్శి పిండిగా వెంకన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు. సామాజిక న్యాయం సాధనలో అంబేద్కర్ ఆలోచనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని అన్నారు. ఈ కార్యక్రమంలో శశిధర్ శిల్పి, బి. జాన్, వి. శ్రీకాంత్, భాను దాస్, అమర్నాథ్, ఎండ్. అరిఫ్, బి. రవీందర్, ఎం. అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు.



