సదాశివపేటలో అంబేద్కర్  జయంతి 

సదాశివపేటలో అంబేద్కర్  జయంతి 

విశ్వంభర, సదాశివపేట : భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం  అధ్యక్షుడు గొంగ్లూరి ప్రభు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నాయకులు అధికారులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన భారతదేశానికి చేసిన సేవలను ఘనంగా కీర్తించారు. ఆయన ఆశయాలు ఆలోచన విధానాలను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలని పలువురు మేధావులు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విచ్చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరు, మున్సిపల్ కమిషనర్ శివాజీ మున్సిపల్ సిబ్బంది పట్టణ సీఐ వెంకటేశం పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకుల చేత ప్రతిజ్ఞ చేయించారు అనంతరం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Tags: