మణుగూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి 

మణుగూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి 

 విశ్వంభర, మణుగూరు : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135వ జయంతిని  మణుగూరు పట్టణంలో ఘనంగా  నిర్వహించారు.  పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నాయకులు, ప్రజలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీని మణుగూరు డిఎస్పి రవీంద్రరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో వివిధ రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి రవీంద్రరెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించిందని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. యువత అంబేద్కర్ ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని పలు విద్యాసంస్థల్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు.

Tags: