ఇనుగుర్తిలో ఘనంగా అంబేద్కర్ జయంతి
విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటంతో కళాకారుల ప్రదర్శన, డీజే పాటల మధ్య భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆహూతులు మాట్లాడుతూ, అంబేద్కర్ సమ సమాజానికి పాటుపడిన మహోన్నతుడని, ప్రపంచ దేశాలతో నీరాజనాలు అందుకుంటున్న మహానుభావుడన్నారు. ఆయన ఆశయాల సాధనకు పునరంకితులు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గంగారపు కరుణాకర్, ఎంపీడీవో పార్థసారధి, స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్, సంఘం అధ్యక్షులు పప్పుల వెంకన్న, కార్యదర్శి సలీం రామ్, స్థానిక, వివిధ గ్రామాల సర్పంచులు, అడ్ హాక్ కమిటీ బాధ్యులు, నాయకులు, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



