జిహెచ్ఎంసి కార్యాలయంలో  అంబేద్కర్ జయంతి 

జిహెచ్ఎంసి కార్యాలయంలో  అంబేద్కర్ జయంతి 

విశ్వంభర, జిహెచ్ఎంసి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలవాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని, కమీషనర్ ఆర్ వి కర్ణన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ, డా.బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా, సమాజంలో అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించేందుకు చేసిన కృషి అమోఘమని కొనియాడారు. ఆయన చూపిన మార్గం అందరికీ ప్రేరణగా నిలవాలని, సమానత్వం, పారదర్శకత సేవా మనోభావం తో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు కె.సత్యనారాయణ, ఎన్. రవికిరణ్,  చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్, పి.ఆర్.ఓ ఖాజా మోజినుద్దిన్, తదితరులు పాల్గొని డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలితో నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Tags: