ఫిలిం టూరిజం అభివృద్ధికి కృషి చేస్తా 

ఫిలిం టూరిజం అభివృద్ధికి కృషి చేస్తా 

  • ఎఫ్‌టిపిసి ఫిలిం టెక్నాల‌జీ అండ్ ఇన్నోవేషన్ వింగ్ ఛైర్మ‌న్‌ కోడే శ్రీచైత‌న్య 

విశ్వంభర, బషీర్ బాగ్: ఫిలిం టూరిజం అభివృద్ధికి త‌మ వంతు కృషి చేస్తానని ఎఫ్‌టిపిసి ఫిలిం టెక్నాల‌జీ అండ్ ఇన్నోవేషన్  వింగ్ ఛైర్మ‌న్ కోడే శ్రీచైత‌న్య, డిజిట‌ల్ అండ్ సెలెబ్రేషన్స్ స్టేట‌జీ ఛైర్మన్ సీహెచ్ హ‌రిలీలా ప్ర‌సాద్ స్ప‌ష్టం చేశారు. ఎఫ్‌టిపిసి ఫిలిం టెక్నాల‌జీ వింగ్ ఛైర్మ‌న్‌గా కోడే శ్రీచైత‌న్య, డిజిట‌ల్ అండ్ సెలెబ్రేషన్స్  స్టేట‌జీ ఛైర్మన్‌గా సీహెచ్ హ‌రిలీలా ప్ర‌సాద్ నియ‌మితులైన సంద‌ర్భంగా ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ప్ర‌మోష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిపిసి) ఆధ్వ‌ర్యంలో ఫిలిం టెక్నాల‌జీ అండ్ ఇన్నోవేషన్  వింగ్‌కు ఛైర్మ‌న్ నియామ‌కాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మాన్ని మంగ‌ళ‌వారం బ‌షీరాబాగ్ ప్రెస్‌క్ల‌బ్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.స‌ముద్ర మాట్లాడుతూ, ఫిలిం టూరిజం అభివృద్ధిలో అగ్ర‌గామి అయిన ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ కౌన్సిల్‌(ఎఫ్‌టిపిసి ఇండియా) నేడు భార‌త దేశంలోనే కాకుండా గ్లోబ‌ల్‌లో ఒక ప్ర‌త్యేక గుర్తింపును తీసుకురావ‌డంలో సంస్థ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు చైత‌న్య జంగా, పి.వి.ఎస్. వ‌ర్మ కృషి ప్ర‌శంస‌నీయ‌మ‌ని కొనియాడారు. ఫిలిం స‌మ్మిట్స్‌లు జ‌ర‌ప‌డంలోను, ఫిలిం ప్ర‌మోష‌న్స్‌లోను, ఫిలిం టూరిజం అభివృద్ధిలో నేడు నియ‌మితులైన కోడే శ్రీచైత‌న్య‌, సీహెచ్ హ‌రిలీలా ప్ర‌సాద్ కృషి చేయాల‌ని సూచించారు. అనంత‌రం ఎఫ్‌టిపిసి ఇండియా అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు చైతన్య జంగా, పీవీఎస్ వ‌ర్మ మాట్లాడుతూ, డిజిట‌ల్ రంగంలో విశేష అనుభవం క‌లిగిన కోడే శ్రీచైత‌న్య‌, సీహెచ్ హ‌రిలీలా ప్ర‌సాద్‌లు త‌మ ప‌దవుల‌కు మ‌రింత వ‌న్నె తెచ్చే విధంగా ప‌నిచేయాల‌ని పేర్కొంటూ వారిని అభినందించారు. కార్య‌క్ర‌మంలో గౌర‌వ అతిథిగా ప్ర‌ముఖ బాలివుడ్ న‌టీమ‌ణి అనీషా ముఖ‌ర్జి పాల్గొని కోడే శ్రీచైత‌న్య‌, సీహెచ్ హ‌రిలీలా ప్ర‌సాద్‌ల‌కు నియామ‌క ప‌త్రాల‌ను అంద‌జేసి అభినంద‌న‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేక అతిథులుగా బిగ్‌బాస్ షానీ, న‌టి సేజ‌ల్‌, అన్నంగి రాజ‌శేఖ‌ర్‌, జి.మ‌ధుక‌ర్‌, ఎం.ఈశ్వ‌ర‌రావు, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త స్వ‌ప్న కాస్వ‌, తెలంగాణ మీడియా ఛైర్మ‌న్ కిర‌ణ్ బెజాడి, రామిశెట్టి అప్పారావు త‌దిత‌రులు పాల్గొని శ్రీచైత‌న్య‌, హ‌రిలీలా ప్ర‌సాద్‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Tags: