మహిళలకు గౌరవప్రదమైన స్థానం కల్పించే బిల్లు
- రాంచందర్ రావు
విశ్వంభర, నారాయణగూడ : భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారాయణగూడ కేశవ మెమోరియల్ కళాశాల నుంచి అసెంబ్లీ వరకు స్కూటీ ర్యాలీ నిర్వహించారు. మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ బిల్లుకు మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ, మహిళలకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ బిల్లు మహిళలకు గౌరవప్రదమైన స్థానం తీసుకువస్తుందని తెలిపారు. అనంతరం నారాయణగూడ కేశవ కళాశాల నుంచి నిర్వహించిన స్కూటీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి మాట్లాడుతూ, మహిళల సాధికారతకు ఈ చట్టం కీలకమని పేర్కొన్నారు. రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించడం ద్వారా దేశ అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు. ర్యాలీలో మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



