కాంగ్రెస్ కార్యాలయంలో  అంబేద్కర్ జయంతి 

కాంగ్రెస్ కార్యాలయంలో  అంబేద్కర్ జయంతి 

విశ్వంభర, బోడుప్పల్ : బోడుప్పల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిసిసి అధ్యక్షులు వజ్లేష్ యాదవ్, మాజీ మేయర్ అజయ్ యాదవ్, బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి  వాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంబేద్కర్ భారతదేశం కోసం రాజ్యాంగం రచించి అన్ని కులాలకు సమాన హక్కులు, స్త్రీలకు హక్కులు, ముఖ్యంగా జీవించి ఉండే ప్రతి ఒక్క మనిషి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఓటు హక్కును కల్పించిన మహనీయుడని, కుల మతలకు అతీతంగా దేశం కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రాసాల వెంకటేష్, సీసా వెంకటేష్, బొమ్మక్ కళ్యాణ్, సుమన్ బుఖ్య, చీరాల నరసింహ, కాంగ్రెస్ నాయకులు విశ్వం గుప్తా, జక్కల రాములు, గుర్రాల వెంకటేష్, దానగళ్ళ యాదగిరి, బొమ్మకు రమేష్, దేవరకొండ వీరాచారి, దిలీప్, బాలరాజు గౌడ్ పాల్గొన్నారు.

Tags: