అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం
విశ్వంభర, హనుమకొండ: వరంగల్ జిల్లా 20 డివిజన్ శాంతి నగర్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు శాంతినగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరు నెరవేర్చాలని అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల గొంతుక అంబేద్కర్ అని తెలిపారు. ఆయన చూపిన బాటలో నడవడమే మన అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భయ్యా స్వామి, గొర్రె దేవదాసు, తోట బాలరాజు , వెల్దండి లక్ష్మణ్, మార్త ఆంజనేయులు, జన్ను వేణు, మంద రమేష్,దేవరాజు, ప్రశాంత్,పెండ్యాల స్వరాజ్, వంశీ, బొచ్చు మహేష్, పద్మనగర్ సారంగపాణి,కూరాకుల చంద్రశేఖర్, దేవనూరి రవి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



