స్మశాన వాటిక కబ్జాకాకుండా చర్యలు తీసుకోవాలి

స్మశాన వాటిక కబ్జాకాకుండా చర్యలు తీసుకోవాలి

 విశ్వాంభర, పెద్దశంకరంపేట: మండల కేంద్రమైన పెద్ద శంకరంపేట లోని తిరుమలాపూర్ శివారులో రజకులకు సంభందించిన స్మశాన వాటిక స్థలాన్ని కబ్జాకు గురికాకుండా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతూ పట్టణ రజక సంఘం అధ్వర్యంలో తహశీల్దార్ ప్రభుదాస్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ శివారులోని 237 సర్వే నంబర్లో ఎంతో కాలంగా రజకులు స్మశానవాటిక ఏర్పాటు చేసుకున్నారని, కొంత మంది అక్రమంగా దానిని కబ్జా చేస్తున్నారని ఈ విషయంలో అధికారులు స్పందించి న్యాయం చేయాలని వారు తహశీల్దార్కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం బాధ్యులు ప్రభు. దశరథ్ కిష్టయ్య సాయి. రవి రాము తదితరులు పాల్గొన్నారు.

Tags: