మనువాదంపై పోరాటమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి
On
విశ్వంభర, హైదరాబాదు : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం నాయకుడు జి రాములు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను సాధించాలంటే మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అవసరమని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సమాన హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. జి రాములు మాట్లాడుతూ, కుల అసమానతల నిర్మూలనకు సామాజిక సంఘాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆర్ శ్రీరాం నాయక్ గిరిజన హక్కుల పరిరక్షణకు రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు.



