పోతిరెడ్డి పల్లిలో అంబేద్కర్ జయంతి
On
విశ్వంభర, సంగారెడ్డి: భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డి పల్లిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శిల్ప వెంచర్ అంబేద్కర్ కాలనీలో స్థానికుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను అందరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రవీందర్ నాయక్, శైలేష్ రెడ్డి, స్థానిక యువ నాయకులు తులసిరామ్, పాండు, కాలనీ వాసులు మల్లేశం, రాకేష్, శంకర్, చాంద్, ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్, సహ కార్యదర్శులు పాండు రంగం, శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు రాజు మార్కుంది, కిషన్, శ్రీకాంత్ రెడ్డి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



