అండర్ డ్రైనేజ్ పనులు ప్రారంభం 

అండర్ డ్రైనేజ్ పనులు ప్రారంభం 

విశ్వంభర, మొయినాబాద్: మొయినాబాద్ మండలంలోని బాకారం జాగీర్ గ్రామపంచాయతీ పరిధిలో 5వ వార్డులో నెలకొన్న అండర్ డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి గ్రామ సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్ ముందడుగు వేశారు. కొంతకాలంగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వార్డు ప్రజల కష్టాలను గుర్తించి, తక్షణమే పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ ఎల్గని వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ సుభాష్ చంద్రబోస్ రెడ్డి, వార్డు సభ్యుడు రాయనోళ్ల ఉపేందర్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి శివశంకర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి కోసం దశల వారీగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, బాకారం జాగీర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిక్షపతి గౌడ్, శ్రీకాంత్ గజానంద్ రెడ్డి, తిరుపతి కరోబర్ జగన్నాథ్ , గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: