ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

విశ్వంభర, చేవెళ్ల : భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మొయినాబాద్, షాబాద్ మండలాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మొయినాబాద్ మండలం సజ్జన్పల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్లుగంటి మధుసూదన్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా షాబాద్ మండల కేంద్రంలో జరిగిన వేడుకల్లో కూడా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న యువతకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ గారు అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానుభావుడని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్యపై ఆయన చూపిన దారి దేశ అభివృద్ధికి మార్గదర్శకమని తెలిపారు. రాజ్యాంగ రూపకర్తగా ఆయన సేవలు అపారమని, ఆయన ఆలోచనలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, షాబాద్ మాజీ ఎంపిటిసి తమ్మలి రవీందర్, షాబాద్ సర్పంచ్ గుండాల అశోక్, షాబాద్ ఉపసర్పంచ్ దండు రాహుల్ గుప్తా, బీసీ సేన అధ్యక్షుడు బర్క కృష్ణ, సర్పంచ్ దివ్య మురళీధర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, లావణ్య చెన్నయ్య, నర్సింలు, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, గౌరీశ్వర్, చంద్రపాల్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

Tags: