హారతీనగర్‌లో చలివేంద్రం ప్రారంభం

హారతీనగర్‌లో చలివేంద్రం ప్రారంభం

విశ్వంభర, పటాన్‌చెరు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హారతీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఇంద్రేశం వైస్ చైర్మన్ పట్లోళ్ల హరీష్ రెడ్డి ప్రారంభించారు. అపెక్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, అడ్వకేట్ మాధవ్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పట్లోళ్ల హరీష్ రెడ్డి మాట్లాడుతూ, వేసవి కాలంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా సమాజ సేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అడ్వకేట్ మాధవ్ మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కాలనీ వాసులకు, బాటసారులకు అందుబాటులో ఉండేలా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

Tags: