అంబేద్కర్ బాటలో పయనించాలి
On
విశ్వంభర, బషీర్ బాగ్: సమాజంలో సమాన అవకాశాలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మార్గం దోహదపడుతుందని స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు దారా మౌనిక, దారా మహేష్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా మంగళవారం దారా మహేష్ , దారా మౌనిక ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతునే అణగారిన వర్గాల మధ్య అంబేద్కర్ చైతన్యం తీసుకొచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరితేనే అంబేద్కర్ కన్న కలలు నిజమవుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ బాటలో పయనించి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కు నివాళులర్పించిన వారిలో సనా, తక్దీర్, తదితరులు ఉన్నారు.



