అగ్నిమాపక సిబ్బంది సేవలు ప్రశంసనీయం

అగ్నిమాపక సిబ్బంది సేవలు ప్రశంసనీయం

  •  ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వంభర, పరిగి:  పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్న సందర్భంగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అగ్నిప్రమాదాలపై ప్రజల్లో అవగాహన చాలా అవసరమని అన్నారు. చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశముందని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అగ్నిమాపక సిబ్బంది సేవలు ఎంతో ప్రశంసనీయమని, వారి కృషి వల్ల అనేక ప్రాణాలు, ఆస్తులు కాపాడబడుతున్నాయని అన్నారు. వారోత్సవాల ద్వారా ప్రజల్లో భద్రతా చర్యలపై అవగాహన పెంపొందించడం ముఖ్య లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ యాదవ రెడ్డి, మున్సిపల్  వైస్ చైర్మన్ హనుమంతు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాదం శ్రీనివాస్ గుప్తా, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags: