కేసముద్రంలో  అంబేద్కర్ జయంతి వేడుకలు

కేసముద్రంలో  అంబేద్కర్ జయంతి వేడుకలు

విశ్వంభర, కేసముద్రం: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని కేసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు ఉప్పునుతల రమేష్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పొదిల నరసింహారెడ్డి,  మండల ప్రధాన కార్యదర్శి బోగోజు నాగేశ్వరా చారి, నాయకులు భువనగిరి ఉపేందర్,  వెలిశాల సవీన్, బానోతు రాము, కంచ సురేందర్, జాటోత్ సురేష్, గుగులోతు బాలు, మంగిశెట్టి నాగన్న, వివిధ మోర్చాల అధ్యక్షులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags: