చలివేంద్రాలు ప్రారంభం

చలివేంద్రాలు ప్రారంభం

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని కాస్య తండా, మునగలవీడు గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. కాస్య తండాలో సర్పంచి బోడ నర్సింహ నాయక్ అధ్యక్షతన ఎస్సై చిర్ర రమేష్ బాబు చలివేంద్రం ప్రారంభించగా, మునిగలవీడులో సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వేసవి దృష్ట్యా గ్రామస్తులు, బాటసారులు  ఈ  చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాస్య తండాలో జి పి కార్యదర్శి చిరంజీవి,ఉపసర్పంచ్ బానోతు నవీన్, మాలోతు హుస్సేన్, సుధాకర్, వెంకన్న, మునిగలవీడులో ఉపసర్పంచి మల్లయ్య, కార్యదర్శి అలీ, వార్డు సభ్యులు నల్లాని పాపారావు,నర్మదా కళ్యాణి, నాయకులు గిరగాని బిక్షపతి గౌడ్,ఇసంపల్లి వెంకటేష్, తుప్పతూరి రాజు, మాసెట్టి నవీన్,రవి,రాజశేఖర్, తదితరులు  ఈ కెర్యక్రమాల్లో పాల్గొన్నారు.

Tags: