వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో ఓరియంటేషన్ ప్రోగ్రాం విజయవంతం.
-ప్రిన్సిపాల్ కమల్ యాదవ్ వెల్లడి.
On
విశ్వంభర, ఉమాడి వరంగల్ :- బొల్లికుంటలోని వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో బి.ఫార్మ్,ఫార్మ్.డి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమం విజయవంతం అయ్యిందని వాగ్దేవి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ కమల్ యాదవ్ మీడియాకు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమం ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కమల్ యాదవ్ అధ్యక్షతన జరగగా ముఖ్య అతిధిగా వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ అండ్ డీన్ ఎస్. ఎస్.వి.ఎన్.శర్మ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్బంగా శర్మ మాట్లాడుతూ భారతదేశంలో ఫార్మసీ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో విద్యార్థులు వృత్తి నైపుణ్యంతో పాటు క్రమశిక్షణ,మానవతా విలువలతో ముందుకు సాగాలన్నారు.వాగ్దేవి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ జి.కమల్ యాదవ్ మాట్లాడుతూ వాగ్దేవి విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక ప్రయోగశాలల సదుపాయాలు, పరిశోధనావకాశాలు, విద్యార్థి వ్యక్తిత్వ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అందిస్తోందని తెలుపుతూ,విద్యార్థులకు కళాశాల అకాడమిక్ నియమాలు,కోర్సు నిర్మాణం,లైబ్రరీ, ప్రయోగశాలలు,ప్లేస్‌మెంట్ శిక్షణ,క్యాంపస్ సదుపాయాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు కూడా పాల్గొని, కళాశాల బోధనా ప్రమాణాలు,విద్యార్థుల పట్ల చూపుతున్న శ్రద్ధ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాగ్దేవి ఇన్స్టిట్యూట్ అఫ్ ఫార్మసెటికల్ సైన్సెస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.స్వప్న రెడ్డి,ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కె.శిరీష రెడ్డి తో పాటు కళాశాల విభాగాధిపతులు ఇతర అధ్యాపకులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు,సిబ్బంది పాల్గొన్నారు.



