ఎమ్మెల్యేను కలిసిన అప్పల రాజన్న
On
విశ్వంభర, నిజామాబాద్: ఇటీవల నిజామాబాద్ డీసీసీ కార్యకవర్గంలో ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అప్పల రాజన్న శనివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జక్రాన్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ను తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువతో సత్కరించారు. ఈ మేరకు నూతనంగా నియమితులైన అప్పల రాజన్నను ఎమ్మెల్యే అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం పలు అంశాల పై చర్చించారు. ఎమ్మెల్యే ను కలిసిన వారిలో పార్టీ నాయకులు రమణారెడ్డి, కేశపల్లి రవికుమార్, ప్రశాంత్, శ్రీధర్, వినోద్, పీర్ సింగ్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.



