నర్సులు వైద్యరంగానికి వెన్నెముఖ
విశ్వంభర, సిద్దిపేట:- రోగుల ప్రాణాలను కాపాడటంలో నర్సుల పాత్ర కీలకమని, వైద్య రంగానికి వారు వెన్నెముకలాంటివారని శుశ్రుత ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ మురళీకృష్ణ అన్నారు. అంతర్జాతీయ నర్సింగ్ డే సందర్భంగా ఆస్పత్రిలోని నర్సింగ్ సిబ్బందిని ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ నర్సింగ్ అనేది ఉద్యోగం కాదని మానవత్వానికి ప్రతీకగా నిలిచే గొప్ప సేవ ధర్మమన్నారు. రోగి బాధను తమ బాధగా భావిస్తూ రాత్రింబవళ్లు సేవలందించే నర్సులు నిజమైన సేవామూర్తులని కొనియాడారు. వైద్యులు సూచించిన చికిత్సను సమర్థంగా అమలు చేయడమే కాకుండా రోగులకు ధైర్యం చెప్పి మానసిక బలాన్ని అందించడంలో నర్సుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ప్రతీ రోగిని కుటుంబ సభ్యుడిలా భావించి సేవలందించే నర్సులకు సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. ఆస్పత్రిలోని నర్సింగ్ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించడంలో విశేష కృషి చేస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో లోహిత్ సాయి, రిచ్ చిల్డ్రన్స్, స్వేచ్ఛ, శ్వాస, అవిషై, మంజునాథ, సాయిరాం ఆస్పత్రుల ప్రతినిధులు, డాక్టర్ శ్రీకాంత్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్యాగ బాబు, నర్సింగ్ సూపరింటెండెంట్ నరేందర్, అనుజ్ఞ, నవ్య, సాయిచరణి, స్పందన, లెనివియా, ఇమాన్యువల్, స్వామి, అజయ్, శ్రావణ్, హమ్మద్ తదితరులు పాల్గొన్నారు.