భాస్కరసేవాసమితి ఆద్వర్యంలో క్రీడాకారులకు సన్మానం
విశ్వంభర, కురవి: ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని రాయపూర్ లో జరిగిన ఖేలోఇండియా జాతీయస్థాయి క్రీడోత్సవాలలో 800 మీటర్ల పరుగుపందెంలో విజయం సాధించిన ఇస్లావత్ తండ గ్రామపంచాయతి కి చెందిన బి నందిని, ఈతపోటీల విభాగంలో విజేతగా నిలిచిన రేకుల తండ గ్రామ పంచాయతీకి చెందిన బానోత్ కావేరి లను కురవి ఎస్ఐ సతీష్, భాస్కరసేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాస్కరసేవాసమితి గౌరవసలహాదారు కొణతం విజయ్, ఇమామ్, విద్యార్థినుల కుటుంబ సభ్యులు, వారి గ్రామాలకు చెందిన పెద్దలు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.