ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి 

విశ్వంభర, హైదరాబాదు: ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ  రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్నారు. హైదరాబాదులో గురువారం  జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అంబర్ పేట పటేల్ నగర్  ఈ నెల 14న ఉద్యమకారుల మహాసభను  ఆదివారం ఉదయం న్యూ పటేల్ నగర్‌లోని ఎస్‌వీఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభకు ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమకారుల హక్కుల కోసం ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా ఏడు డిమాండ్లను వివరించారు. వాటిలో 250 గజాల ఇంటి స్థలం కేటాయింపు, రూ.27 వేల పెన్షన్ అమలు, ఉద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం, రూ.1 కోటి వరకు రుణ సదుపాయం, అమరుల స్మృతి వనం ఏర్పాటు, వైద్య–విద్యా సదుపాయాలు, గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయడం ఉన్నాయి. డిమాండ్లను తఅమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉద్యమకారు బి వి రమణ, ఎం సిద్ధార్థ ముదిరాజ్, కే రామారావు యాదవ్, జి విష్ణువర్ధన్, సి దేవానంద్, పెంటం నర్సింహా, టి నరేంద్ర ముదిరాజ్, బొట్ట మహేష్ గౌడ్, సూరి ముదిరాజ్ శివ, కాళారెడ్డి, బాలు తదితరులు పాల్గొన్నారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-government-should-solve-the-problems-of-the-activists-immediately/article-16576

Tags: