నాంపల్లి మండల పద్మశాలి కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
విశ్వంభర, నాంపల్లి:- మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో గ్రామ సర్పంచ్ నక్క చంద్రశేఖర్, కుల పెద్దల సమక్షంలో మండల పద్మశాలి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ, యువతకు మార్గదర్శకత్వం కల్పించడం, అలాగే కుల ఐక్యతను బలోపేతం చేయడం లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు కుల పెద్దలు తెలిపారు. నూతన కమిటీలో అధ్యక్షుడిగా నక్క చంద్రమౌళి, ఉపాధ్యక్షులుగా గోలి కృష్ణ, కోట అయోధ్య, ప్రధాన కార్యదర్శిగా పున్న కోటేశ్వర్, కార్యదర్శిగా కర్నాటి శ్రీహరి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కుల పెద్దలు, సంఘ సభ్యులు నూతన కమిటీ సభ్యులను అభినందించారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘ అభివృద్ధి, సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తామని నూతన కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పద్మశాలి సంఘానికి చెందిన పెద్దలు, యువకులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.