బీ-కేటగిరి సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించాలి
విశ్వంభర, మెహదీపట్నం : ఇంజనీరింగ్ బీ-కేటగిరి సీట్లను కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేసి, యాజమాన్య కోటా పేరుతో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. హైదరాబాదు మాసబ్‌ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు యాజమాన్య కోటా పేరుతో డిమాండ్ ఉన్న కోర్సుల సీట్లను అధిక ఫీజులకు విక్రయిస్తూ మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజులకు మించి వసూళ్లు, నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీ-కేటగిరి సీట్లను పూర్తిగా కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని, అక్రమాలకు పాల్పడుతున్న కళాశాలలపై ఏసీబీ, ఆదాయపు పన్ను శాఖలతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రఘురాం నాయక్, గ్యార నరేష్, రెహమాన్, ఏండి అన్వర్, అనిల్, దత్తు రెడ్డి, ఆకాష్ నాయక్, శాంతి కుమార్, లెనిన్, హరీష్, అశ్వన్, యశ్వంత్, చట్ల సమ్మయ్య, రాహుల్, లోకేష్, వినోద్, సిద్ధు పాల్గొన్నారు.