నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి 

నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి 

 విశ్వంభర, బాగ్‌లింగంపల్లి : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కుటుంబంపై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట్ర రజక సంఘాల సంయుక్త సమావేశం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. మల్లన్న జాతర సందర్భంగా జరిగిన ఈ ఘటనలో రెండు నెలల పసిపాప మృతి చెందడం, మహిళలు తీవ్రంగా గాయపడడం పట్ల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Tags: