త్వరలో కొత్త రేషన్ కార్డులు.. పొంగులేటి కీలక ప్రకటన

త్వరలో కొత్త రేషన్ కార్డులు.. పొంగులేటి కీలక ప్రకటన

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలు, బడుగు బలహీనవర్గాలు, మహిళలు, రైతులను దృష్టిలో పెట్టుకొని పాలన సాగిస్తోంది. సంక్షేమ పథకాలు కూడా ఈ వర్గాలకు లబ్ది చేసేలా అమలు చేస్తున్నారు. ఇప్పటికే రుణమాఫీపై ఓ క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్.. నిన్నే పంట భీమాపై కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.    

 

Read More పదవి విరమణ సందర్బంగా ఎస్.ఐ వెంకటరాములుకు ఘనంగా సన్మానం

ఆయన సొంత నియోజకవర్గం పాలేరులో ప్రజల వద్దకే మంత్రి పొంగులేటి కార్యక్రమం నిర్వహించారు. నియంతృత్వ పాలన నుంచి మార్పు కావాలనే ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని ఆయన అన్నారు. సొంతింటి కలను నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని ఆయన హామీ ఇచ్చారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. అంతేకాదు.. త్వరలోనే అర్హులు అందరికీ కొత్త రేషన్ కార్డులు, పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా అన్నారు. పొంగులేటి ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. 

 

Read More పదవి విరమణ సందర్బంగా ఎస్.ఐ వెంకటరాములుకు ఘనంగా సన్మానం

బీఆర్ఎస్ హయాంలో గత కొన్నేళ్లుగా కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయలేదు. దీంతో.. పొంగులేటి ప్రకటన పట్టాలెక్కితే వేల కుటుంబాలకు లబ్ధి జరిగే అవకాశం ఉంది. సొంతగా రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వ పథకాల అమలుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రేషన్ కార్డులతో పాటు.. గ్రామాల్లో స్కూల్లు, రోడ్లు, కమ్యూనిటీ హల్ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తి చేస్తామని పొంగులేటి చెప్పారు. ఎన్నికల కోడ్ పూర్తి అవ్వగానే ప్రకటనలు అన్ని పట్టాలెక్కుతాయని అన్నారు. సమస్యలు తెలసుకొని మరీ పరిష్కరిస్తామని అన్నారు.