ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్
విశ్వంభర, మహబూబాబాద్: జీవ విజ్ఞాన శాస్త్రాలలో బహుళ శాస్త్రీయ పరిశోధనలో అభివృద్ధి చెందుతున్న కొత్త దిశలు అనే అంశంపై జిల్లా కేంద్రం లోని నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతు వృక్ష శాస్త్ర శాఖల ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సెమినార్ ప్రిన్సిపాల్ ప్రొ.బి.లక్ష్మణ్ నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, జీవశాస్త్రం, దాని అనుబంధ శాస్త్రాలలో బహుముఖ పరిశోధనల ప్రాముఖ్య్యాన్ని జాతీయ సెమినార్ విశదీకరిస్తుందని తెలిపారు. అనంతరం సెమినార్ సావనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొర్రూర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి రాములు మాట్లాడుతూ, కళాశాల 42 సం.ల చరిత్రలో జాతీయ సెమినార్ ను మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. సెమినార్లో ఎన్ఐటి వరంగల్ ప్రొ. డా.బి శ్రీనివాసులు, డా.ఆమంచి నాగేశ్వర రావు,డా. విజయభాస్కర రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ప్రొ.సిహెచ్ శ్రీనివాసులు, జూపూడి అనిల్ కుమార్,డా.మసూద్ అహ్మద్ ,బి శ్రీనివాస్, డా. వి సాంబశివరావు,ఏ అన్నపూర్ణ, డా.బి హాతిరామ్, డా.ఖాసీంషా,యం.సుమన్,యం వీరు, డా.కే సుమలత, డా.పి ఉపేందర్,జి రవితేజ ఎం సంతోష్ కుమార్, కే యాకయ్య, ఓ ఉదయ్ కుమార్ , యన్ నరేష్, డి ఎస్ రామన్న, కొండి సందీప్, ఎన్ సుదర్శన్, టి రాజేందర్, కే సునీత, ఎండి పాషా, లింగయ్య, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .



