నగరంలో పౌరాణిక  నాటక ప్రదర్శనలు

నగరంలో పౌరాణిక  నాటక ప్రదర్శనలు

విశ్వంభర, ఫిలింనగర్‌ : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు నగరంలో పౌరాణిక నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకుడు పొత్తూరి వెంకట సుబ్బారావు  తెలిపారు. ఫిలింనగర్‌లోని డాక్టర్ డి. రామానాయుడు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా మయసభ, భక్త ప్రహ్లాద, చెంచులక్ష్మి, సత్య హరిచంద్ర, బాలనాగమ్మ, భక్త చింతామణి తదితర పౌరాణిక రంగస్థల నాటకాలను ఈ రంగంలో నిష్ణాతులైన కళాకారులు ప్రదర్శించనున్నట్లు వివరించారు. గత కొన్ని సంవత్సరాలుగా నగర ప్రజలకు రంగస్థల ప్రదర్శనలు అందిస్తూ కళాపట్ల తన అభిమానం చాటుకుంటున్నట్లు తెలిపారు. దశాబ్దాలుగా పౌరాణిక రంగస్థలాన్ని ప్రేమించే ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నాటకాలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా నిర్వహించే ఈ పౌరాణిక ప్రదర్శనలను ప్రజలు తిలకించి రంగస్థల కళాకారులను ప్రోత్సహించాలని కోరారు.

Tags: