మున్సిపల్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ

మున్సిపల్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ

 విశ్వంభర, మహబూబాబాద్ : బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని నగరపాలక సంస్థ కార్యాలయాన్ని  జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ఆ కస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ తమ పర్యటనలో భాగంగా మున్సిపల్ కార్యాలయ పరిసరాలను పరిశీలించి ఫైళ్లను వెంటనే క్లియరెన్స్ చేయాలని, అనవసరమైన స్క్రాప్ ను వెంటనే ఖండం చేయాలని, సూచించారు. సుమారు గంటన్నరకు పైగా కార్యాలయంలో ఆమె తనిఖీలు నిర్వహించి స్వయంగా ఫైళ్లను పరిశీలించారు. వివిధ పనుల దరఖాస్తుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల యొక్క వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, వారి సమస్యలను సావధానంగా పరిశీలించి వారికి తగిన విధంగా పరిష్కారం చూపాలని తెలిపారు. మున్సిపల్ పరిధిలో అంతర్గత ఫైళ్ల క్లియరెన్స్, అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని, నగర పరిధిలో ఉన్నటువంటి కాలనీలలో విద్యుత్, త్రాగునీరు సరఫరా లో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని, సానిటేషన్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాలు, ప్రాంతాలలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, తహసిల్దార్ రాజేశ్వరరావు, సంబంధిత అధికారులు ఉన్నారు.

Tags: