ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

విహెచ్, జెట్టి కుసుమ కుమార్‌లకి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

విశ్వంభర, ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖర్గేతో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాలపై సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కూడా ఈ విషయంపై మాట్లాడానని, వి. హనుమంతరావు, జెట్టి కుసుమ కుమార్‌లకి రాజ్యసభ ఇవ్వాలని కోరానని అన్నారు.WhatsApp Image 2026-02-27 at 10.38.04 AM

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే విషయంపై రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖర్గేని కలవడానికి ఢిల్లీకి వచ్చానని తెలిపారు. రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ కారణంగా ఆయన బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వి. హనుమంతరావు. జెట్టి కుసుమ కుమార్‌లకు రాజ్యసభ అవకాశాలపై ఆలోచన చేయాలని కోరానని తెలిపారు. జెట్టి కుసుమ కుమార్.. యూత్ కాంగ్రెస్ లీడర్‌గా, స్టూడెంట్ లీడర్‌గా కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నారని ప్రస్తావించారు. జెట్టి కుసుమ కుమార్ ఫ్యామిలీ ఫ్రీడమ్ ఫైటర్స్ అని, వాళ్ల కుటుంబం నుంచి అంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారని గుర్తుచేశారు.

Read More మునుగోడు లోని కఠినమైన వైన్ పాలసీకి స్వాగతం పలికిన జిల్లా బిజెపి యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి

హనుమంతరావు తెలంగాణలో అనేక మంది ముఖ్యమంత్రులతో పని చేశారని వెల్లడించారు. మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారని చెప్పుకొచ్చారు. ఆయనకు రాజీవ్ గాంధీ , సోనియాగాంధీ అవకాశాలు ఇచ్చారని తెలిపారు. వి.హనుమంతరావు చురుకైన వ్యక్తి అని, ఆయనకు మరోసారి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని ఖర్గేను కోరానని అన్నారు. కమిటీలో చర్చిస్తామని ఖర్గే హామీ ఇచ్చారని తెలిపారు. రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు.